Ileana: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • నెంబర్ గేమ్ అంటే చిరాకంటున్న ఇలియానా 
  • కొత్త దర్శకుడితో నారా రోహిత్ 
  • క్రైం థ్రిల్లర్ చేస్తున్న శర్వానంద్ 
  • 'కాంచన' రీమేక్ లో అక్షయ్ కుమార్ 

*  తనకసలు నెంబర్ గేమ్ పై నమ్మకం కాని, ఆసక్తి కాని లేవంటోంది కథానాయిక ఇలియానా. టాలీవుడ్ ని వదిలేసి బాలీవుడ్ కి వెళ్లి అక్కడా సక్సెస్ కాలేకపోయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మాట్లాడుతూ, 'నెంబర్ గేమ్ అంటే నాకు మొదటి నుంచీ చిరాకు. ఇదంతా నాన్సెన్స్ గా అనిపిస్తుంది. అసలు ఒకరు నెంబర్ వన్ అని ఎలా నిర్ణయిస్తారో కూడా నాకు తెలియదు. అందుకే నేనెప్పుడూ ఈ నెంబర్ గేమ్ లో లేను' అని చెప్పింది.    
*  విభిన్న కథా చిత్రాలను చేస్తూ వస్తున్న హీరో నారా రోహిత్ తాజాగా మరో చిత్రానికి సంతకం చేశాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఎస్.డి.చక్రవర్తి దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ మార్చిలో మొదలవుతుంది.
*  శర్వానంద్ తన తదుపరి చిత్రానికి క్రైం థ్రిల్లర్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. 'దండుపాళ్యం' ఫేం శ్రీనివాసరాజు దీనికి దర్శకత్వం వహిస్తాడు. ఇద్దరు హీరోయిన్లు నటించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది.
*  తెలుగు, తమిళ భాషల్లో హిట్టయిన 'కాంచన' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. లారెన్స్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రను పోషిస్తాడట.       

More Telugu News