india: నివాసానికి భారత్ ఎంతో చౌక... ప్రపంచంలో రెండో స్థానం... బెర్ముడా ఎంతో ఖరీదైనది!

  • ఇంటి అద్దెలు ఇక్కడే తక్కువ
  • జీవించేందుకు చౌకైన మొదటి దేశం దక్షిణాఫ్రికా
  • గో బ్యాంకింగ్ రేట్స్ సంస్థ ర్యాంకింగ్ లు

ఈ ప్రపంచంలో జీవించేందుకు అతి తక్కువ వ్యయం అయ్యే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఈ ప్రపంచంలో నివాసానికి చాలా ఖరీదైన ప్రాంతంగా బెర్ముడా అని గో బ్యాంకింగ్ రేట్స్ అనే సంస్థ తెలిపింది. నాలుగు కీలకమైన అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించింది. స్థానికంగా కొనుగోలు శక్తి, ఇంటి అద్దెలు, గ్రోసరీ ధరలు, వినియోగదారుల ధరలను పరిగణనలోకి తీసుకుంది. ఇంటి అద్దెల విషయంలో 50 దేశాలను పరిశీలిస్తే నేపాల్ తర్వాత అతి తక్కువ ఉన్నది భారతలోనేనని ఈ సంస్థ తెలిపింది. వినియోగ ఉత్పత్తులు, కిరాణా సరకుల ధరలు భారత్ లోనే తక్కువట.

భారత్ లో కొనుగోలు శక్తి 20.9 శాతం తక్కువని, అద్దెలు 95.2 శాతం చౌక అని, గ్రోసరీ 74 శాతం తక్కువని, ఇతర ఉత్పత్తుల ధరలు సైతం 75 శాతం తక్కువని ఈ సంస్థ వెల్లడించింది. పొరుగున ఉన్న పాకిస్థాన్ (14), నేపాల్ (28), బంగ్లాదేశ్ (40) కంటే చాలా చౌకగా జీవించేందుకు అనుకూలంగా ఉన్నట్టు ఈ నివేదికలో పేర్కొంది. చాలా ఖరీదైన దేశాలను పరిశీలిస్తే ఘనా (108), స్విట్జర్లాండ్ (109), హాంగ్ కాంగ్ (110), బహమాస్ (111), బెర్ముడా 112వ స్థానాల్లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News