USA: చైనాకు చెక్ పెట్టిన భారత తీరు చూసి ఆశ్చర్యపోయిన అమెరికా!

  • డోక్లాంకు సమీపంలో ఆఘమేఘాల మీద రన్ వే
  • 40 యుద్ధ విమానాల మోహరింపు
  • వెంటనే హసీమర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు సుఖోయ్, బ్రహ్మోస్ లు
  • గమనించిన అమెరికా నిఘా శాటిలైట్లు

భారత్, చైనా, టిబెట్ సరిహద్దు ప్రాంతమైన డోక్లాంకు అతి దగ్గరగా చైనా యుద్ధ విమానాలు మోహరించిన తరువాత, భారత్ తీసుకున్న చర్యలు, స్పందించిన తీరు అమెరికాను ఆశ్చర్యపరిచింది. డోక్లాంకు సమీపంలోని తన దేశ పరిధిలో ఆగమేఘాల మీద ఓ రన్ వేను నిర్మించి దాదాపు 40 యుద్ధ విమానాలను చైనా అక్కడికి పంపింది. చైనా కుయుక్తులను పసిగట్టిన భారత్, వారి పన్నాగానికి చెక్ పెట్టేలా కీలక నిర్ణయం తీసుకుంది.

డోక్లాంకు దగ్గర్లోనే పశ్చిమ బెంగాల్ లో ఉన్న హసీమర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను భారీగా అభివృద్ధి చేసింది. సుఖోయ్ యుద్ధ విమానాలను అక్కడ మోహరించింది. దాదాపు 30 విమానాలను అక్కడికి పంపింది. సుఖోయ్ లతో పాటు బ్రహ్మోస్ క్షిపణులనూ చేర్చింది. దీంతో వెనక్కు తగ్గిన చైనా, తన బేస్ లోని యుద్ధ విమానాలను వెనక్కు తీసుకోక తప్పలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని అమెరికా నిఘా శాటిలైట్లు గమనించాయి. చైనాకు చెక్ పెట్టిన తీరును, దూకుడును అడ్డుకున్న విధానం అమెరికాను సర్ ప్రైజ్ చేశాయి. చైనా చర్యకు దీటైన ప్రతిచర్యను చూపడంతో పాటు, భారత్ సంయమనంగా వ్యవహరించిందని అమెరికా అధికారులు వ్యాఖ్యానించారు.

More Telugu News