Indian: 22 ఏళ్ల తరువాత... 'భారతీయుడు-2'!

  • వచ్చే నెలలోనే 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ మొదలు
  • తైవాన్ లో ఎగిరిన హీలియం బెలూన్
  • కథను అందిస్తున్న జయమోహన్
"సొంత కుమారుడే అయినా దారి తప్పితే ప్రాణాలు తీయాల్సిందే" అనే కాన్సెప్ట్ తో సుమారు 22 సంవత్సరాల క్రితం వచ్చిన సూపర్ డూపర్ హిట్ 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్ కు తెరలేపాడు దర్శకుడు శంకర్. ఇప్పటికే కథను సిద్ధం చేసుకున్న ఆయన, తొలి భాగంలో నటించిన విలక్షణ నటుడు కమల్ హాసన్ తోనే రెండో భాగాన్నీ ప్లాన్ చేసుకున్నాడు.

'భారతీయుడు-2' ను త్వరలోనే ప్రారంభిస్తామని చెబుతూ, తైవాన్ లో హీలియం బెలూన్ ను ఆయన ఎగరేశాడు. దీనిపై 'ఇండియన్ 2' అని తమిళం, ఇంగ్లీషులో రాసుంది. ప్రస్తుతం శంకర్ రూపొందిస్తున్న '2.0' (రోబో-2)కి ఒక రచయితగా వ్యవహరించిన జయమోహన్‌ 'భారతీయుడు-2'కి రైటర్‌ గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందట.
Indian
Bharateeyudu
Shankar
Rajanikant

More Telugu News