Viral Videos: పర్యాటకుల జీపుపై దాడి చేసిన ఏనుగు... మీరూ చూడండి!

  • బోట్స్‌వానాలోని చోబే నేష‌నల్ పార్కులో ఘటన
  • భయపడిపోయిన పర్యాటకులు
  • దూసుకొచ్చి జీపు వెనుక భాగం నుంచి ఏనుగు దాడి

జూ పార్కులో జంతువుల‌ను చూస్తూ ఎంజాయ్ చేయ‌డానికి వెళ్లిన ప‌ర్యాట‌కుల‌కు భ‌యాన‌క అనుభ‌వం ఎదురైంది. జూలో వారు ప్ర‌యాణిస్తోన్న జీపుపై ఓ గ‌జ‌రాజు దాడి చేయ‌డంతో వారంతా వ‌ణికిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను జూ అధికారులు తాజాగా విడుద‌ల చేశారు. ఆఫ్రికాలోని బోట్స్‌వానాలోని చోబే నేష‌నల్ పార్కులో ఇటీవ‌ల ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. జీపులో ఉన్న త‌మ‌వైపునకు ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చిన ఏనుగుని చూసి ప‌ర్యాట‌కులు కంగారు ప‌డ్డారు. అంత‌లోనే అది జీపు వెన‌క‌భాగం నుంచి దాడి చేసింది. దీంతో జీపు డ్రైవ‌ర్ ఆ వాహ‌నాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాడు.. మీరూ చూడండి.  

More Telugu News