Congress: ఆధిప‌త్య కుల దురహంకారానికి దళితులు భయపడిపోయారంటూ చంద్రబాబుకి రఘువీరారెడ్డి లేఖ

  • ఇటీవల గుంటూరు జిల్లా పెద గొట్టిపాడులో ద‌ళితుల‌పై దాడి: ఏపీసీసీ అధ్యక్షుడు
  • ద‌ళితుల‌పై దాడికి పాల్ప‌డిన వారిని చట్ట‌ప్ర‌కారం శిక్షించాలి
  • సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధును కూడా అరెస్ట్ చేశారు

గుంటూరు జిల్లా పెద గొట్టిపాడులో ద‌ళితుల‌పై దాడికి పాల్ప‌డిన వారిని చట్ట‌ప్ర‌కారం శిక్షించాల‌ని, బాధిత ద‌ళితుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని పేర్కొంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి ఏపీసీసీ అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి లేఖ రాశారు. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌పంచ‌మంతా పండుగ చేసుకుంటుంటే పెద‌గొట్టిపాడులో మాత్రం ద‌ళితులు గాయాల‌తో ఆధిప‌త్య కుల దురహంకారానికి బలై ప్రాణాల‌ను అరచేతిలో పెట్టుకుని భ‌యాందోళ‌న‌ల‌తో గ‌డిపారని లేఖ‌లో పేర్కొన్నారు. ద‌ళితుల‌పై దాడుల వివ‌రాల‌ను తెలుసుకునేందుకు వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధుతో పాటు ప‌లువురిని అరెస్టు చేయ‌డం దారుణ‌మ‌ని ర‌ఘువీరారెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News