devisri prasad: పెళ్లి గురించి అడిగితే.. ‘నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదా?’ అంటూ దేవిశ్రీ ప్ర‌సాద్‌ స‌మాధానం!

  • తాజాగా మీడియాతో మాట్లాడిన దేవిశ్రీ
  • దేవిశ్రీ ప్రసాద్ స‌మాధానంతో బిగ్గ‌ర‌గా న‌వ్వుకున్న విలేక‌రులు
  • మ‌హేశ్ 25వ సినిమాకు తానే సంగీతం అందిస్తున్నానన్న దేవిశ్రీ
మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడ‌గ‌గా, ‘మీకు నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదా?’ అంటూ స‌మాధానం ఇచ్చాడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌. తాజాగా దేవిశ్రీ ప్ర‌సాద్‌ మీడియాతో మాట్లాడుతూ ఇలా చమత్కరించాడు. ఆయ‌న జ‌వాబుకి అంద‌రూ బిగ్గ‌ర‌గా న‌వ్వేశారు. తాను ‘రంగస్థలం’ సినిమాకే కాకుండా రామ్‌చరణ్‌-బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాన‌ని తెలిపాడు.

అలాగే, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రానున్న‌ మహేశ్ బాబు 25వ సినిమాకు కూడా తానే సంగీతం అందిస్తున్నాన‌ని చెప్పాడు. జనరంజకమైన సంగీతం అందిస్తూ, టాలీవుడ్ అగ్ర సంగీత ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా దేవిశ్రీ ప్ర‌సాద్ ప్ర‌శంస‌లు అందుకుంటోన్న విష‌యం తెలిసిందే. 
devisri prasad
marriage
Mahesh Babu
cinema

More Telugu News