Chandrababu: బీజేపీతో జగన్ దోస్తీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

  • ఎంపీలతో జగన్ ఎందుకు రాజీనామాలు చేయించలేదు?
  • కేసుల నుంచి బయటపడటం, అక్రమాస్తులను కాపాడుకోవడమే జగన్ లక్ష్యం
  • బీజేపీతో కలుస్తామంటూ జగన్ చెప్పడం ఇదే మొదటిసారి కాదు
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. బీజేపీతో దోస్తీ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ... బీజేపీతో కలుస్తానంటూ జగన్ చెప్పడం ఇదే మొదటిసారి కాదని ఎద్దేవా చేశారు. ఒక మాటపై నిలబడే వ్యక్తిత్వం జగన్ ది కాదని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పిన జగన్... ఇంతవరకు ఎందుకు రాజీనామాలు చేయించలేదని ప్రశ్నించారు. కేసులను ఎత్తి వేయించుకోవడానికి, అక్రమాస్తులను కాపాడుకోవడానికే జగన్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమాస్తుల్లో చిక్కుకున్నవారి ఆస్తులను స్వాధీనం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావాలని ఆయన అన్నారు. 
Chandrababu
Jagan
BJP
YSRCP
Telugudesam

More Telugu News