visa: హెచ్‌1బీ వీసాల విషయంలో మరో గుడ్‌న్యూస్!

  • హెచ్‌1 బీ వీసాలపై వార్షిక పరిమితిని పెంచడానికి బిల్లు ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సెనేటర్లు
  • వీసాల పరిమితి ఏడాదికి 85 వేలకు పెంపు
  • అవసరమైతే అదనంగా 1,10,000 వీసాల మంజూరు
  • ఒక ఆర్థిక సంవత్సరంలో 1,95,000 వరకు వీసాల మంజూరుకు అవకాశం

హెచ్1బీ వీసాల గడువు పొడిగింపు, కొత్త వీసాల జారీ విషయంలో అమెరికా కొత్త నిబంధనలు, ఆంక్షలు పెడుతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంలో అమెరికా తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా అమెరికాలో రిపబ్లికన్‌ సెనేటర్లు సెనేట్‌లో హెచ్‌1 బీ వీసాలపై వార్షిక పరిమితిని పెంచడానికి ఉద్దేశించిన బిల్లును ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు సదరు వీసాల పరిమితి ఏడాదికి 65 వేలుగా ఉండగా ఈ బిల్లు ప్రకారం ఆ పరిమితిని 85 వేలకు పెంచారు. అదనంగా పెంచిన ఈ 20 వేల వీసాలను అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన వారికి ఇవ్వనున్నారు.

అంతేకాదు, ఒకవేళ కంపెనీలకు మరింత మంది ఉద్యోగులు అవసరమయితే అందుకు తగ్గట్లుగా కొత్త వారి కోసం అదనంగా 1,10,000 వీసాలు కూడా మంజూరు చేసుకునేలా ఈ బిల్లు తీసుకొచ్చారు. దీంతో మొత్తం హెచ్‌1బీ వీసాలు ఒక ఆర్థిక సంవత్సరంలో 1,95,000 వరకు మంజూరు చేయవచ్చు. అలాగే, హెచ్‌1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములతో పాటు వారి పిల్లలకు హెచ్‌-4 కింద ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వనున్నారు. 

More Telugu News