chennai super kings: ధోనీ టీం నిండా సీనియర్లే!

  • ఆడేందుకు వయసు అడ్డం కాదని నిరూపించే ప్రయత్నంలో చెన్నై సూపర్ కింగ్స్
  • ఐదుగురు వయసు పైబడిన ఆటగాళ్లను కొనుగోలు చేసిన చెన్నై జట్టు
  • ధోనీ సహా ఆరుగురు 30 ఏళ్లు పైబడిన ఆటగాళ్లు
ఆడేందుకు వయసు అడ్డంకి కాదని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల నిషేధం తరువాత ఐపీఎల్ లో అడుగుపెడుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులోకి సీనియర్ ఆటగాళ్లను తీసుకుంది. చెన్నై జట్టుకు ధోనీపై అపారమైన విశ్వాసమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 30 ఏళ్లకు పైబడిన ఐదుగురు స్టార్ ఆటగాళ్లను తీసుకుంది.

వారి వివరాల్లోకి వెళ్తే, హర్భజన్‌ సింగ్‌ (37 ఏళ్లు), షేన్‌ వాట్సన్‌ (36 ఏళ్లు), డ్వేన్‌ బ్రేవో (34 ఏళ్లు), డుప్లెసిస్‌ (33 ఏళ్లు), కేదార్‌ జాదవ్‌ (32 ఏళ్లు). ధోనీ కూడా సీనియర్ అన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టులో ఆరుగురు సీనియర్ ఆటగాళ్లు ఉన్నారు. 
chennai super kings
mahendra singh dhoni
IPL
Cricket

More Telugu News