prabhas srinu: ప్రభాస్ లేకపోతే నేననే వాడిని లేనట్టే: ప్రభాస్ శ్రీను

  • నటనలో శిక్షణ తీసుకున్నాను 
  • అక్కడ ప్రభాస్ తో పరిచయం 
  • అది కొనసాగుతూ వచ్చింది    
రౌడీ గ్యాంగ్ లో ఒకరిగా కనిపిస్తూ .. కామెడీ టచ్ తో కూడిన రౌడీయిజాన్ని పలికించడంలో ప్రభాస్ శ్రీను తన ప్రత్యేకతను చూపుతుంటాడు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో ప్రత్యేకతను చాటుకునే ప్రభాస్ శ్రీను, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "మధు ఫిల్మ్ ఇనిస్టిస్ట్యూట్ లో నటనలో శిక్షణ తీసుకున్న తరువాత, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాను. కానీ ఎక్కడా అవకాశాలు రావడం లేదు".

 "వైజాగ్ లో సత్యానంద్ గారి దగ్గర శిక్షణ తీసుకోవడం మరింత మంచిదనే ఉద్దేశంతో మా నాన్నగారు ఆయనను రిక్వెస్ట్ చేసి అక్కడ చేర్చారు. ఆ బ్యాచ్ లో ప్రభాస్ ఉండటంతో ఆయనతో పరిచయమైంది. ఆ తరువాత నుంచి ప్రభాస్ ను సరదాగా కలుస్తూ ఉండేవాడిని. ఇక రాఘవేంద్ర నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాను. అందువల్లనే నన్ను అంతా ప్రభాస్ శ్రీను అంటారు .. నా పేరుకు ముందు ఆయన పేరు యాడ్ అయిన తరువాతనే నా వ్యాల్యూ పెరిగింది .. ఆయన లేకపోతే నేననేవాడిని లేనట్టే" అని చెప్పుకొచ్చాడు.    
prabhas srinu

More Telugu News