samanta: నయనతార .. నిత్యామీనన్ కాదనడంతోనే రంగంలోకి సమంత!

  • సమంత ప్రధాన పాత్రగా 'యు టర్న్'
  • పోలీస్ ఆఫీసర్ గా ఆది పినిశెట్టి
  • సమంత బాయ్ ఫ్రెండ్ గా రాహుల్ రవీంద్రన్  

క్రితం ఏడాది కన్నడలో వచ్చిన 'యు టర్న్' హిట్ కొట్టేసింది. ఈ సినిమాను తెరకెక్కించిన పవన్ కుమార్, తెలుగులోను రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సమంత ప్రధానమైన పాత్రను పోషించనున్న ఈ సినిమాలో, ఆమె బాయ్ ఫ్రెండ్ గా రాహుల్ రవీంద్రన్ కనిపించనున్నాడు.

ఇక ముఖ్యమైన పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా ఆది పినిశెట్టి చేయనున్నాడు. ఈ సినిమాను మొదట సమంతతోనే చేయాలనుకున్నారు. కానీ ఆమె వివాహం కారణంగా ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో, నయనతారను .. నిత్యామీనన్ ను సంప్రదించారట. నయనతార డేట్స్ ఖాళీ లేవని చెప్పడం వలన, నిత్యామీనన్ కుదరదని చెప్పడం వలన సమంతనే ఖరారు చేసుకున్నారట. తెలుగులో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.  

More Telugu News