Chandrababu: ఎగరని జాతీయ జెండా.. ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు

  • మూలపాడులో ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారుల క్రికెట్ టోర్నీ
  • తాడు బిగుసుకుపోవడంతో ఎగరని జెండా
  • నిర్వాహకులపై మండిపడ్డ చంద్రబాబు
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అధికారుల క్రికెట్ టోర్నమెంట్ అమరావతి సమీపంలోని మూలపాడులో ప్రారంభమయింది. ఈ టోర్నీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం 34 టీమ్ లు పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు.

ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు జెండాను ఆవిష్కరించగా, తాడు బిగుసుకుపోవడంతో, జాతీయ జెండా ఎగరలేదు. దీంతో చంద్రబాబు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. టోర్నమెంట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా ఆవిష్కరణ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాగంటూ మండిపడ్డారు. 
Chandrababu
mulapadu cricket tournament
national flag

More Telugu News