District Collector: ఇట్స్ ఫన్నీ.. 'నవ్వు'లపాలైన కలెక్టర్ ఆమ్రపాలి ప్రసంగం!

  • రిపబ్లిక్ డే ప్రసంగం నవ్వులపాలు
  • పలుమార్లు తడబడిన కలెక్టర్
  • ప్రసంగం మధ్యలో నవ్వులు
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి వ్యవహారశైలి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం విమర్శలపాలైంది. ప్రసంగం మధ్యలో అదేపనిగా నవ్వడం, గణాంకాల దగ్గర తడబడటం, మధ్యలో 'ఇట్స్ ఫన్నీ' అంటూ వ్యాఖ్యానించడం ఆమెపై విమర్శలకు కారణమైంది.

ఇదే సమయంలో తెలుగులో రాసిన ప్రసంగ పాఠాన్ని చదువుతూ ఆమె పలుమార్లు తడబడ్డారు. మరుగుదొడ్ల నిర్మాణం గురించి మాట్లాడుతున్న సమయంలో నవ్వుకుంటూ వెనక్కి తిరిగిన ఆమె... 'ఇట్స్ ఫన్నీ' అంటూ వ్యాఖ్యానించారు. ఇదంతా కూడా మైకుల ద్వారా ప్రసారమైంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 
District Collector
amrapali
amrapali speech

More Telugu News