mensa iq test: ఐన్ స్టీన్, స్టీఫెన్ హ్యాకింగ్స్ ను మించిన మేధావులీ భారత సంతతి చిన్నారులు!

  • ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ ఐక్యూ స్కోర్ 160
  • మెహుల్ గార్గ్, ధృవ్‌ గార్గ్‌ ల ఐక్యూ స్కోర్ 162
  • గూగుల్ కంటే పెద్ద కంపెనీని ఏర్పాటు చేస్తాం

ప్రఖ్యాత శాస్త్రవేత్తలు ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌ల కంటే తెలివితేటలు కలిగిన వారిగా భారతీయ మూలాలు కలిగిన లండన్ బాలుడు మెహుల్ గార్గ్ (10) నిలిచాడు. మేధావితనానికి కొలమానంగా భావించే ‘మెన్సా ఐక్యూ పరీక్ష’లో 162 స్కోర్‌ సాధించాడు. గతేడాది అతడి అన్న ధృవ్‌ గార్గ్‌ (13) 162 స్కోరు సాధించడం విశేషం. అన్నయ్యను స్పూర్తిగా తీసుకున్న మెహుల్ అతనికి తీసిపోనని నిరూపించుకున్నాడు.

ఈ ఐక్యూ పరీక్షలో 140 స్కోరు సాధించిన వారిని మేధావిగా గుర్తిస్తారు. అలాటిది ఈ అన్నదమ్ములిద్దరూ 162 స్కోరు సాధించడం విశేషం. కాగా ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ ల స్కోరు 160 కావడం విశేషం. ఆ ఇద్దరు మేధావుల కంటే మెహుల్, ధృవ్‌ గార్గ్‌ లు రెండు పాయింట్లు ఎక్కువ సాధించడం గమనార్హం. గూగుల్ కంటే పెద్ద కంపెనీని తయారు చేస్తామని వారు చెబుతున్నారు.

ఇప్పటికే అన్నదమ్ములిద్దరూ విరాళాల ద్వారా 1300 పౌండ్లు (1,17,000 రూపాయలు) సేకరించారు. వీటితో ఇరుగుపొరుగును అనుసంధానించి, ఒంటరితనం భావనను తగ్గించే యాప్ ను తయారు చేస్తున్నారు. మరోవైపు ఛానల్‌ 4లో ప్రసారమయ్యే ‘చైల్డ్‌ జీనియస్‌ 2018’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వంద మంది ఎంపిక కాగా, వారిలో మెహుల్ కూడా ఉండడం విశేషం. 

More Telugu News