Donald Trump: 'బొమ్మ'పై మనసు పడ్డ ట్రంప్... అధ్యక్షుడి కోరికను తిరస్కరించిన మ్యూజియం!

  • వాన్‌ గోగ్‌ గీసిన ఓ పెయింటింగ్‌ ను ప్రదర్శనకు ఉంచిన గుగెన్ హైమ్ మ్యూజియం
  • పెయింటింగ్ ట్రంప్ కు నచ్చిందని, ఇవ్వాలని కోరిన వైట్ హౌస్
  • పెయింటింగ్ కు బదులు బంగారు టాయిలెట్ ఇస్తామన్న మ్యూజియం నిర్వాహకులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను కోరుకున్న వస్తువును క్షణాల్లో సొంతం చేసుకోగలరు. అయితే, అలాంటి ట్రంప్ కోరికను ఒక మ్యూజియం నిష్కర్షగా తిరస్కరించిన అవమానకర ఘటన చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌ లోని గుగెన్‌ హైమ్‌ మ్యూజియంలో ప్రముఖ చిత్రకారుడు వాన్‌ గోగ్‌ గీసిన ఓ పెయింటింగ్‌ ను ప్రదర్శనకు ఉంచారు. ఆ పెయింటింగ్‌ చూసి మనసు పారేసుకున్న ట్రంప్... దానిని తనకు ఇవ్వాలని ఆ మ్యూజియంను కోరారు.

అయితే, మ్యూజియం నిర్వాహకులు మాత్రం ఆ పెయింటింగ్ ను ఇవ్వలేమని స్పష్టం చేస్తూ, దాని బదులు 18 క్యారెట్ల బంగారంతో తయారుచేసిన టాయ్‌ లెట్‌ ను ఇస్తామని, ఆ టాయ్‌ లెట్‌ పై 'అమెరికా' అని రాసుంటుందని, దాని ధర కేవలం మిలియన్‌ డాలర్లు మాత్రమేనని సమాధానం ఇచ్చారు. కాగా, ఏడాదిపాటు మ్యూజియంలోని ఐదో అంతస్తులో ప్రదర్శనకు ఉంచిన ఆ బంగారు టాయ్ లెట్ ను మారిజియో కాటెలాన్‌ అనే వ్యక్తి తయారు చేశాడని చెప్పారు. దీనిపై వైట్ హౌస్ స్పందన తెలియాల్సి ఉందని మ్యూజియం నిర్వాహకులు తెలిపారు.

More Telugu News