Mahesh Babu: 'మహేశ్‌ బాబు వాయిసే అంతా చెప్పేస్తోంది'.. అంటూ సినీ ప్రముఖుల అభినందనలు

  • ‘భరత్‌ అనే నేను’ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు ప్రమాణ స్వీకార ఆడియో విడుదల
  • ఇది కేవలం ఆరంభం మాత్రమే: వంశీ పైడిపల్లి
  • మహేశ్‌ గొంతు వింటుంటే సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తుకొచ్చారు: రామజోగయ్య శాస్త్రి
  • ఒళ్లు గగుర్పొడిచింది: అఖిల్

మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటోన్న‌ ‘భరత్‌ అనే నేను’ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు ప్రమాణ స్వీకార ఆడియోను ఈరోజు ఈ సినిమా యూనిట్‌ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాపై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు స్పందిస్తూ త‌మ అభిప్రాయాన్ని తెలిపారు. మహేశ్‌ బాబు వాయిసే అంతా చెప్పేస్తోందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేన‌ని వంశీ పైడిపల్లి అన్నారు. మహేశ్‌ గొంతు వింటుంటే సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తుకొచ్చారని రామజోగయ్య శాస్త్రి పేర్కొన్నారు.

తొలి ప్రమాణస్వీకారంతోనే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతోందని, ఫ్యాన్స్ సిద్ధంగా ఉండాల‌ని అనిల్‌ సుంకర అన్నారు. త‌న‌ ఒళ్లు గగుర్పొడిచిందని, తొలి ప్రమాణ స్వీకారం చాలా బాగా జరిగింద‌ని అఖిల్ అన్నాడు. సినిమా యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నాన‌ని గుణశేఖర్ పేర్కొన్నారు.

'అబ్బా..ఏమున్నాడు రా బాబూ' అని సుధీర్ బాబు వ్యాఖ్యానించాడు. గణతంత్ర దినోత్సవ ట్రీట్‌ ఇది అని మెహరీన్ అన‌గా, గణతంత్ర దినోత్సవాన‌ ‘భరత్‌ అనే నేను’ ప్రమాణస్వీకారం.. జై హింద్ అని బ్రహ్మాజీ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News