Vijayawada: గుంటూరు కి'లేడీ' దీప్తిపై కేసు యూటర్న్... పోలీసుల తీరును తప్పుబట్టిన కోర్టు!

  • పెళ్లి వెబ్ సైట్లలో తప్పుడు ప్రొఫైల్స్ సృష్టించిన దీప్తి
  • ఆపై ఎన్నారైలను మోసం చేసిన కిలేడీ
  • హైదరాబాద్ లో ఉంటే విజయవాడలో కేసేంటన్న దీప్తి న్యాయవాది
  • పోలీసులను ఆక్షేపించిన కోర్టు

మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్లలో తప్పుడు ప్రొఫైల్స్ సృష్టించి, పలువురిని మోసగించిన గుంటూరు బ్రాడీపేటకు చెందిన దీప్తి కేసు ఇప్పుడు యూ టర్న్ తీసుకుంది. ఈ కేసులో పోలీసులు కనీస నిబంధనలను పాటించలేదని, రిమాండ్ రిపోర్టు తప్పుల తడకగా ఉందని కోర్టు కూడా ఆక్షేపించడం గమనార్హం. ఓ ఎన్నారై ఫిర్యాదుతో దీప్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఆమె తరఫు లాయర్ రంగప్రవేశం చేసి పోలీసుల వైఖరిని తప్పుబట్టారు.

తన క్లయింటు దీప్తి హైదరాబాద్ లో ఉండగా, విజయవాడలో కేసును ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. అదే వాదనను ఆయన కోర్టులో వినిపించడంతో న్యాయమూర్తి సైతం పోలీసులను మందలించారు. మరోవైపు దీప్తి సైతం కేసు పెట్టిన ధరణి కుమార్ ఎవరో తనకు తెలియదని మీడియాకు చెప్పుకొచ్చింది. అయితే, ఈ లేడీ కిలాడీపై గతంలో ఉన్న కేసులను తిరిగి తోడటం ద్వారా ఆమెను జైలుకే పంపించాలని పోలీసులు భావిస్తున్నారు. పాత కేసుల్లోని ఫిర్యాదిదారులను ఇప్పుడు వారు తిరిగి సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News