Mahesh Babu: 'భరత్ అనే నేను' సినిమా కోసం: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహేష్ బాబు... వినండి!

  • 'భరత్ అనే నేను' ఫస్ట్ ఓత్ విడుదల
  • ఆడియో క్లిప్ ను సోషల్ మీడియాలో ఉంచిన ప్రిన్స్ మహేష్
  • ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న మహేష్

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'భరత్ అనే నేను'లోని ఓ కీలక డైలాగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఆయన ముఖ్యమంత్రిగా నటిస్తుండగా, ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియోను 'ఫస్ట్ ఓత్' రూపంలో చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. ఆ ఆడియో క్లిప్ ను ప్రిన్స్ మహేశ్ స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు.

"భరత్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగము పట్ల నిజమైన విశ్వాసము, విధేయతా చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాగానీ, పక్షపాతంగాగానీ, రాగద్వేషాలుగానీ లేకుండా, రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను" అన్న మహేష్ గొంతు ఇందులో వినిపిస్తోంది. ఆపై వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైతం ఆకట్టుకునేలా ఉంది. మీరూ వినండి.

  • Loading...

More Telugu News