అచ్చెన్నాయుడికి ఇదే నా వార్నింగ్: విష్ణుకుమార్ రాజు
- విష్ణుకుమార్ రాజు పూటకో మాట మాట్లాడతారన్న అచ్చెన్నాయుడు
- ఎప్పుడు మాట మార్చానో చెప్పాలని ప్రశ్నించిన విష్ణుకుమార్ రాజు
- నిజా నిజాలను నిర్ధారించుకుని మాట్లాడాలని వార్నింగ్
ఒకరి వ్యక్తిత్వంపై విమర్శించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి వుంటుందని, కానీ అచ్చెన్నాయుడు బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. నీతి, నిజాయతీలతో కూడిన రాజకీయాలను మాత్రమే తాను చేస్తానని, ఆ సంగతిని అచ్చెన్నాయుడికి గుర్తు చేస్తున్నానని అన్నారు.