ilaya raja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు 'పద్మవిభూషణ్'

  • సంగీత దర్శకుడు, కంపోజర్, గాయకుడు, వాయిద్యకారుడుగా ఇళయరాజా కీర్తి
  • 2010లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ఇళయరాజా
  • 'పద్మవిభూషణ్'తో మరోసారి ఆయనను గౌరవించిన కేంద్ర ప్రభుత్వం

గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని కేంద్ర ప్ర‌భుత్వం ఈ రోజు ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. సంగీత దర్శకుడు, కంపోజర్, గాయకుడు, వాయిద్యకారుడు అయిన ఇళయరాజాకు పద్మ విభూషణ్ లభించింది. ఇళయరాజాకు 2010లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందించిన విషయం తెలిసిందే.

సినీ సంగీతానికి చేసిన కృషికిగాను ఆయన 2012లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2014లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెన్సు పురస్కారం, 2015లో గోవాలో జరిగిన 46వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియాలో జీవితకాల సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు. 

More Telugu News