Congress: రాజకీయాల్లో ‘అంటరానివాడు’ అనేదే ఉండదు: ‘కాంగ్రెస్’ సీనియర్ నేత కేవీపీ

  • ఎవరెవరు పొత్తులు పెట్టుకుంటారనేది ఆరోజున తెలుస్తుంది
  • 2019లో కేంద్రంలో ‘కాంగ్రెస్’ విజయానికి వంద శాతం అవకాశాలు
  • కాంట్రాక్టు విషయాల్లో రాజీలు పడి, సర్దుబాట్లు కుదిరితే .. 2020కు ‘పోలవరం’ పూర్తి కావచ్చు

రాజకీయాల్లో ‘అంటరానివాడు’ అనే ప్రస్తకే ఉండదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఎవరెవరు పొత్తులు పెట్టుకుంటారనేది ఆ రోజున తెలుస్తుందని, రాజకీయాల్లో అంటరానివాడనే వాడు ఎవ్వడూ ఉండడని అన్నారు.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన్ని ప్రశ్నించగా, ‘ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. కాంట్రాక్టు విషయాల్లో రాజీలు పడి, సర్దుబాట్లు కుదిరితే .. 2020కి ఈ ప్రాజెక్టు పూర్తి కావచ్చు! నా ప్రగాఢమైన నమ్మకం ఏంటంటే.. కేంద్రంలో మళ్లీ యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే  ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు కింద ఇది పూర్తవుతుంది. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి వంద శాతం అవకాశాలు ఉన్నాయి.

‘పోలవరం’ జాతీయ ప్రాజెక్టు కనుక ఈ ప్రాజెక్టుకు ఏం పేరు పెట్టాలనే దానిపై కేంద్ర ప్రభుత్వానికి అథారిటీ ఉంటుంది. కనుక, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుకు ‘ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు’ అని పేరు పెట్టుకుంటాం’ అని ఆయన జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News