Krishna Kumari: కృష్ణకుమారిని రెండుసార్లు కాపాడిన ఎన్టీఆర్!

  • పెద్ద అలకు కొట్టుకు పోయిన కృష్ణకుమారి
  • మరోసారి గుర్రం వల్ల ప్రమాదం
  • రెండుసార్లూ కాపాడిన ఎన్టీఆర్

అలనాటి అందాల నటి కృష్ణకుమారి నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో అందరిలానే ఆమె కూడా ఎన్నో కష్టాలను అనుభవించారు. ఆ తర్వాత తన అందం, అభినయంతో అగ్రస్థానానికి ఎదిగారు. కత్తి కాంతారావుతో ఆమె ఎక్కువ సినిమాలు చేసినప్పటికీ... ఎన్టీఆర్, కృష్ణకుమారిలది హిట్ కాంబినేషన్.

1963లో 'లక్షాధికారి' సినిమా షూటింగ్ సందర్భంగా కృష్ణకుమారి దాదాపు చావు అంచుల వరకు వెళ్లారు. ఓ పాటను సముద్రపు ఒడ్డున అలల మధ్యలో చిత్రీకరిస్తున్నప్పుడు ఓ పెద్ద అల వచ్చి ఆమె మీద పడింది. దీంతో, ఆమె కొట్టుకుపోయారు. అయితే, ఆమె చేతిని వదలకుండా ఎన్టీఆర్ గట్టిగా పట్టుకోవడంతో... ప్రవాహంలోకి కొట్టుకుపోకుండా ఆమె ఆగారు.

మరోసారి 'బందిపోటు' సినిమా కోసం గిండి అడవుల్లో గుర్రపు స్వారీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో గుర్రం ఒక్కసారిగా స్పీడు పెంచింది. అప్పుడు కూడా ఆమెను ఎన్టీఆరే కాపాడారు. ఓ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ తనకు పునర్జన్మను ఇచ్చారని తెలిపారు.

  • Loading...

More Telugu News