raj tarun: రాజ్ తరుణ్ తీసుకున్న కొత్త నిర్ణయం

  • ఆకట్టుకోలేకపోయిన 'రంగుల రాట్నం'
  • ప్రమోషన్స్ లోపమేనంటోన్న రాజ్ తరుణ్ 
  • ఇకపై ఈ విషయంలో జాగ్రత్తలు

రాజ్ తరుణ్ తాజా చిత్రంగా రూపొందిన 'రంగుల రాట్నం' .. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాకి, శ్రీరంజని దర్శకత్వం వహించింది. చిత్రా శుక్లా కథానాయికగా నటించిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

సంక్రాంతి సెలవుల్లో యూత్ కి సంబంధించిన కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా, వాళ్ల మనసులను దోచుకోవడంలో విఫలమైంది. ఈ సినిమా ఇలా పరాజయంపాలు కావడం రాజ్ తరుణ్ ను బాగా హర్ట్ చేసిందట. సరైన ప్లానింగ్ .. ప్రమోషన్స్ లేకపోవడం వల్లనే ఈ సినిమా ఆడియన్స్ కి రీచ్ కాలేదని రాజ్ తరుణ్ భావిస్తున్నాడట. ఈ సారి నుంచి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాడట.  

  • Loading...

More Telugu News