Padmaavat: పద్మావత్ సినిమాను వ్యతిరేకిస్తున్నానన్న దిగ్విజయ్

  • నిరసనల మధ్య దేశ వ్యాప్తంగా విడుదలైన ‘పద్మావత్’ 
  • ఇలాంటి సినిమాలు తీయకపోవడం మేలు
  • ఈ సినిమా కులాల మనోభావాలను గాయపరుస్తుంది 
దేశ వ్యాప్తంగా ‘పద్మావత్’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రాజ్ పుత్ వర్గాన్ని కించపరిచే దృశ్యాలు లేవని దీనిని చూసినవారు చెబుతున్నప్పటికీ, నాలుగు రాష్ట్రాల్లో ఇంకా ప్రదర్శనకు నోచుకోని సంగతి తెలిసిందే. రాజ్ పుత్ కర్ణి సేన కార్యకర్తలు నిరసనలతో హోరెత్తిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్ ఢిల్లీలో మాట్లాడుతూ, 'పద్మావత్' సినిమాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. అసలు 'పద్మావత్‌' వంటి సినిమాలు తీయకపోవడం మేలని ఆయన అభిప్రాయపడ్డారు. 'పద్మావత్‌' సినిమా కులాల మనోభావాలను గాయపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
Padmaavat
movie
digvijaysingh

More Telugu News