indian market: భార‌త మార్కెట్‌లో నెం.1 స్మార్ట్‌ఫోన్ కంపెనీగా షియోమీ... శాంసంగ్‌ని దాటేసిన వైనం

  • మార్కెట్‌లో 25 శాతం వాటా ఈ చైనా కంపెనీదే
  • 23 శాతానికి ప‌డిపోయిన శాంసంగ్ వాటా
  • త‌ర్వాతి స్థానాల్లో లెనెవో, ఒప్పో, వివో
  • నివేదిక వెల్ల‌డించిన కౌంట‌ర్‌పాయింట్ రీసెర్చీ సంస్థ‌

దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేప‌థ్యంలో వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి త‌క్కువ ధ‌ర‌కే అత్య‌ద్భుత ఫీచ‌ర్ల‌తో మొబైల్ త‌యారీ కంపెనీలు స్మార్ట్‌ఫోన్ల‌ను విడుద‌ల చేస్తున్నాయి. దీంతో వాటి మ‌ధ్య పోటీ విప‌రీతంగా పెరిగిపోయింది. ప్ర‌స్తుతం భార‌త మార్కెట్‌లో నెం.1 స్మార్ట్‌ఫోన్ కంపెనీగా చైనా సంస్థ షియోమీ నిలిచింది. చాలా కాలంగా మొద‌టి స్థానంలో ఉన్న శాంసంగ్‌ను ఈ కంపెనీ దాటేసింది. ప్ర‌ముఖ మార్కెట్ రీసెర్చీ సంస్థ కౌంట‌ర్‌పాయింట్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. గ‌తేడాది నాలుగో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ విప‌ణిలో 25 శాతం వాటాను షియోమీ చేజిక్కించుకోగా, శాంసంగ్ వాటా 23 శాతానికి ప‌డిపోయింద‌ని కౌంట‌ర్‌పాయింట్ పేర్కొంది.

ఇక ఈ సంస్థ‌ల త‌ర్వాత ఒక్కోటి 6 శాతం వాటా చొప్పున లెనెవో, ఒప్పో, వివో సంస్థ‌లు త‌ర్వాతి మూడు స్థానాల్లో నిలిచాయి. గ‌తేడాది మొత్తం వివ‌రాలు ప‌రిశీలిస్తే స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో, అన్ని ర‌కాల మొబైల్ అమ్మ‌కాల మార్కెట్‌లో శాంసంగ్ మొద‌టి స్థానంలో ఉంది. అందులో శాంసంగ్ వాటా 24 శాతం ఉండ‌గా, షియోమీ వాటా 19 శాతం ఉందని కౌంట‌ర్‌పాయింట్‌ నివేదిక‌లో పేర్కొంది. గ‌తేడాది భార‌త్‌లో 300 మిలియ‌న్ల మొబైల్ అమ్మ‌కాలు జ‌ర‌గ‌గా, అందులో 44 శాతం స్మార్ట్‌ఫోన్లేనని నివేదిక‌లో ఉంది.

More Telugu News