Rahul Gandhi: దావోస్ నుంచి వస్తూ కొంతైనా తెచ్చారా?: మోదీపై రాహుల్ సెటైర్

  • మోదీపై ట్విట్టర్ మాధ్యమంగా రాహుల్ సెటైర్లు
  • 73 శాతం సంపద ఒక్క శాతం ధనికుల వద్దే ఎందుకుంది?
  • స్విట్జర్లాండ్ నుంచి వస్తూ ఎంత నల్లధనం తెచ్చారు?
2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా నల్లధనాన్ని వెనక్కి తెస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై ట్విట్టర్ మాధ్యమంగా సెటైర్ వేశారు. స్విట్జర్లాండ్‌ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత్ కు తిరిగి వస్తూ విమానంలో కొంతైనా నల్లధనాన్ని తీసుకువచ్చారా? అని ప్రశ్నించారు.

మీరు స్విట్జర్లాండ్‌ నుంచి నల్లధనం తెస్తారని ఇక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన గుర్తుచేశారు. దేశసంపదలో 73 శాతం సంపద... జనాభాలో ఒక్క శాతం ఉన్న ధనికుల వద్దే ఎందుకు పోగుపడిందనే దానిపై ప్రధాని ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 
Rahul Gandhi
Narendra Modi
Twitter

More Telugu News