Tamilnadu: మీది ప్రజా ప్రభుత్వమైతే.. వారి కోరిక మన్నించండి: తమిళనాడు ప్రభుత్వానికి కమల్ సూచన

  • జనవరి 19న బస్సు ఛార్జీలను పెంచిన తమిళనాడు ప్రభుత్వం
  • 20 శాతం నుంచి 54 శాతం పెరిగిన బస్సు ఛార్జీలు
  • భారం మోయలేమంటూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న యువత

తమిళనాడులో ఐదు రోజుల క్రితం బస్సు ఛార్జీలను 20 శాతం నుంచి 54 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై యువత నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో, పాత బస్సు ఛార్జీలనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, గత ఐదు రోజులుగా కళాశాలలను బహిష్కరిస్తూ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పెరిగిన ఛార్జీలు తమ ఆర్థిక స్థితిగతులపై ప్రభావం చూపుతున్నాయని, పెంచిన ఛార్జీలు ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. దీనిపై సోషల్ మీడియా ద్వారా కమల హాసన్ స్పందిస్తూ, ‘ప్రభుత్వం ప్రజలకు అనుకూలమైనదైతే..పెంచిన ఛార్జీలను తగ్గించేందుకు కృషి చేయండి’ అంటూ ట్వీట్‌ చేశారు. 

More Telugu News