'హలో' సినిమాలో నా ఫోన్ నెంబర్ వాడారు.. నాగార్జున నష్టపరిహారం ఇవ్వాలి!: జార్ఖండ్ వాసి డిమాండ్
- సినిమాలో హీరోయిన్ వాడిన ఫోన్ నంబర్ తనదంటున్న జార్ఖండ్ వాసి
- తనకు పలువురు ఫోన్ చేసి వేధించారంటున్న బాధితుడు
- 50 లక్షలు చెల్లించాలంటూ కోర్టుకెక్కిన వైనం
అసలీ కల్యాణి ఎవరు? ఇంతమంది ఎందుకు ఫోన్లు చేస్తున్నారని ఆరాతీయగా, 'హలో' సినిమాలో హీరోయిన్ వాడిన నంబర్ గా తన నెంబర్ ను పేర్కొన్నారని, దీంతో తన నెంబర్ కు ఫోన్ చేసి విసిగిస్తున్నారని తెలిసిందని పేర్కొంటూ, అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. కాగా, దీనిపై స్పందించిన నాగ్... తాము టెలికాం ఆపరేటర్ అనుమతి తీసుకున్నాకే సినిమాలో ఆ నంబర్ ను వినియోగించుకున్నామని, ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నట్టు సమాచారం.