Andhra Pradesh: ఇకపై ఏపీలో నకిలీ, కల్తీ మందులకు ఆస్కారం ఉండదు: మంత్రి కామినేని

  • నకిలీ, కల్తీ మందులను అణచివేస్తాం
  • ప్రతి జిల్లాకు ఒకొక్క ‘డ్రగ్ టెస్టు’ పరికరం అందజేస్తాం
  • అన్ని మందులు నేరుగా తయారీ యూనిట్ నుంచి దుకాణనికే
  • మీడియాతో మంత్రి కామినేని శ్రీనివాసరావు

ఏపీలో నకిలీ మందులను అణచివేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నకిలీ, కల్తీ మందులకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామని, ఈ నేపథ్యంలో ముప్పై లక్షల రూపాయల వ్యయంతో డ్రగ్ టెస్టు పరికరాన్ని జిల్లాకు ఒకటి చొప్పున త్వరలో అందజేయనున్నట్టు చెప్పారు.

అన్ని మందులను నేరుగా తయారీ యూనిట్ నుంచి దుకాణం వరకు ఆన్ లైన్ చేస్తూ త్వరలో సమగ్ర మందుల ట్రాకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆరోగ్య సేవల గురించి మాట్లాడుతూ, శస్త్రచికిత్సల అనంతర పరీక్షల నిమిత్తం గ్రామాల్లోనే సింగిల్ డాక్టరు క్లినిక్స్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

More Telugu News