Allu Arjun: 'నా పేరు సూర్య' నుంచి రిపబ్లిక్ డే స్పెషల్

  • అల్లు అర్జున్ హీరోగా 'నా పేరు సూర్య'
  • రిపబ్లిక్ డే సందర్భంగా ఓ సాంగ్ రిలీజ్ 
  • ఫిబ్రవరి 14న రొమాంటిక్ సాంగ్ విడుదల

వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' చిత్రం రూపొందుతోంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఈ సినిమా నుంచి 'సైనికా' అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ప్రతి మనసులోనూ దేశభక్తి ఉప్పొంగేలా ఈ సాంగ్ ఉంటుందని అంటున్నారు.

 ప్రపంచ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఒక రొమాంటిక్ సాంగ్ ను కూడా వదులుతారట. విశాల్ - శేఖర్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనుంది. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తమిళ .. మలయాళ .. హిందీ .. బెంగాలీ .. మరాఠీ .. భోజ్ పురి భాషల్లోకి ఈ సినిమాను అనువదిస్తారు.    

  • Loading...

More Telugu News