terrorist sidharth: భారత సంతతి వ్యక్తిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా

  • ఉగ్రవాది సిద్ధార్థ్ హిందూ మతస్తుడు
  • మతం మార్చుకుని ఐసిస్ లో చేరాడు
  • ఇతని భార్య కూడా ఉగ్రవాదే

భారత సంతతికి చెందిన ఐసిస్ ఉగ్రవాది సిద్ధార్థ్ ధార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. బ్రిటన్ లో ఉండే సిద్ధార్థ్ హిందూ మతం నుంచి ఇస్లాంకు మారాడు. పేరును అబూ రుమైసాగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఇతన్ని 'న్యూ జిహాదీ జాన్'గా పిలుస్తున్నారు. ఐసిస్ లో ఇతను సీనియర్ కమాండర్ గా వ్యవహరిస్తున్నట్టు పలు పత్రికలు కథనాలను ప్రచురించాయి. యాజిదీ తెగకు చెందిన నిహాద్ బరకత్ అనే బాలికను అపహరించి అక్రమ రవాణా చేశాడు సిద్ధార్థ్.

2014లో తన భార్య, పిల్లలతో కలసి యూకే నుంచి సిరియాకు వెళ్లి ఐసిస్ లో సిద్ధార్థ్ చేరాడు. వీరిద్దరి నుంచి ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని తన దేశ పౌరులతో పాటు, అంతర్జాతీయ సమాజాన్ని కూడా అమెరికా హెచ్చరించింది. జిహాదీ జాన్ గా పేరుగాంచిన మొహమ్మద్ ఎమ్వాజీ స్థానంలో సిద్ధార్థ్ ను ఐసిస్ నియమించినట్టు సమాచారం. 2016 జనవరిలో ఐసిస్ విడుదల చేసిన వీడియోలో ముసుగుతో కనిపించిన ఉగ్రవాది సిద్ధార్థేనని భావిస్తున్నారు. బ్రిటన్ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో పలువురు బందీలను హత్య చేసినప్పుడు ఆ వీడియోను చిత్రీకరించారు.

More Telugu News