Hyderabad: బ్రేకింగ్ న్యూస్... షార్ట్ సర్క్యూట్ కారణంగా తగలబడుతున్న ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయం!

  • షార్ట్ సర్క్యూట్ తో మంటలు
  • చూస్తుండగానే భవనమంతా వ్యాపించిన మంటలు
  • ఆర్పేందుకు శ్రమిస్తున్న ఫైర్ సిబ్బంది
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ ఆర్టీయే ఆఫీస్ లో మంటలు చెలరేగుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రధాన కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏర్పడిన మంటలు, కొద్ది సేపట్లోనే భవనం మొత్తానికి వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయానికి ఇంకా ఆఫీసు తెరచుకోకపోవడంతో ఆస్తి నష్టమే తప్ప ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో పలు కంప్యూటర్లు, సర్వర్లు దగ్ధమైనట్టు తెలుస్తోంది. మంటలతో పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేయగా, ట్రాఫిక్ స్తంభించింది. ఆర్టీయే కార్యాలయానికి పక్కనే ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లకు మంటలు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు.
Hyderabad
Khairatabad
RTA Office
Fire Accident

More Telugu News