Vallabhaneni Vamsi: షార్ట్ సర్క్యూట్ కారణంగా వల్లభనేని వంశీ కార్యాలయం దగ్ధం!
- ఎమ్మెల్యే వంశీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
- షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం
- పలు పత్రాలు, గృహోపకరణాలు దగ్ధం
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కార్యాలయం అగ్నిప్రమాదానికి ఆహుతైంది. వంశీ పర్యటనలో ఉడడంతో, ఆయన కార్యాలయంలో విద్యుత్ మరమ్మతు పనులను ప్రైవేటు ఎలక్ట్రీషియన్ తో పూర్తిచేయించారు. పని పూర్తి చేసిన ఎలక్ట్రీషియన్ విద్యుత్ పునరుద్ధరించి వెళ్లిన కాసేపటికే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి.
వంశీ ఛాంబర్ పక్కనే ఉండే విశ్రాంతి గదిలో మంటలు చెలరేగి వ్యాపించడంతో పలు పత్రాలు, గృహోపకరణాలు కాలి బూడిదయ్యాయి. విషయం తెలుసుకున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలికి చేరుకుని ప్రమాదం వివరాలు ఆరాతీశారు. సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు అంచనా వేస్తున్నారు.