mahammad siraj: క్రికెటర్ సిరాజ్ ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రాం, ఈ మెయిల్ ఖాతాలను హ్యాక్ చేసిన 14 ఏళ్ల బాలుడు

  • మహ్మద్ సిరాజ్ సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్
  • తన ప్రమేయం లేకుండా క్రికెట్ లైవ్ వీడియోలు అప్ లోడ్ కావడంతో గుర్తింపు
  • సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు
ఐపీఎల్ లో ఆడడం ద్వారా టీమిండియాలో స్థానం సంపాదించుకున్న హైదరాబాద్ వర్ధమాన క్రికెటర్‌ మహ్మద్ సిరాజ్‌ సోషల్ మీడియా ఖాతాలను 14 ఏళ్ల బాలుడు హ్యాక్‌ చేసిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. తన ఫేస్ బుక్, ఈ మెయిల్, ఇన్ స్టా గ్రాం ఖాతాలు హ్యాక్ అయిన విషయం గుర్తించిన సిరాజ్ సీసీఎస్‌ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బంజారాహిల్స్ కు చెందిన 14 ఏళ్ల బాలుడిని హ్యాకర్ గా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకుని మందలించి వదిలేశారు. 
mahammad siraj
team india cricketer
t20 player

More Telugu News