Hyderabad: ‘ఐమాక్స్’ థియేటర్ పై తార్నాక వ్యక్తి ఫిర్యాదు .. నోటీసులు జారీ చేసిన హైకోర్టు!

  • బిగ్ స్క్రీన్ థియేటర్ లోని సీట్ల మధ్య దారి వదలలేదు
  • అత్యవసర పరిస్థితులు తలెత్తితే అక్కడి నుంచి బయటపడలేం
  • హైకోర్టుకు ఓ లేఖ రాసిన తార్నాక వాసి
  • ఆ లేఖను పిల్ గా స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్ లోని ఐమాక్స్ థియేటర్ పై తార్నాకకు చెందిన విజయగోపాల్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఐమాక్స్ లోని బిగ్ స్క్రీన్ థియేటర్ లో ప్రేక్షకులు కూర్చునేందుకు 14 వరుసల్లో సీట్లు ఉన్నాయని, ఒక్కో వరుసలో 47 సీట్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అయితే, ఆ  సీట్ల మధ్య దారి వదలలేదని, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు బయటకు వెళ్లడం కష్టమంటూ ఈ మేరకు హైకోర్టుకు ఓ లేఖ రాశారు.

ఈవిషయమై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా స్వీకరించింది. ఈ మేరకు ఐమాక్స్ థియేటర్ యాజమాన్యంతో పాటు తెలంగాణ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అగ్నిమాపక శాఖ డీజీకి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.

More Telugu News