new cec: నూత‌న చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌గా బాధ్యతలు చేపట్టిన ఓం ప్రకాష్ రావత్

  • అచ‌ల్ కుమార్ జ్యోతి స్థానంలో నియామ‌కం
  • మ‌ధ్యప్ర‌దేశ్ మాజీ ఐఏఎస్ కేడ‌ర్‌కి చెందిన ఓం ప్ర‌కాశ్ రావ‌త్‌
  • మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌కార్శ‌ద‌ర్శి, భార‌త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేసిన ఓం ప్ర‌కాశ్‌
భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ)గా ఓం ప్రకాష్ రావత్ బాధ్యతలు చేపట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు సీఈసీగా ఉన్న అచ‌ల్ కుమార్ జ్యోతి ప‌ద‌వీకాలం సోమ‌వారంతో ముగిసింది. ఆయ‌న స్థానంలో ఓం ప్ర‌కాశ్ రావ‌త్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. మధ్యప్రదేశ్ మాజీ ఐఏఎస్ కేడర్ కు చెందిన రావత్ రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో సేవలు అందించారు. రక్షణ, భారీ పరిశ్రమల శాఖలతో పాటు ఆయన 2004-2006 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించారు.  

ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ నుంచి సీఈసీగా రావత్ పదోన్నతి పొందటంతో ఆయన స్థానంలో కమిషనర్ గా ఆర్ధికమంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అశోక్ లవాసా నియమితులయ్యారు.  
new cec
om prakash rawat
achal kumar jyothi

More Telugu News