కరణ్ జొహార్ ను కిడ్నాపర్ల నుంచి కాపాడే పాత్రలో రానా!
- 'వెల్ కం టు న్యూయార్క్' సినిమాలో సన్నివేశం
- డ్యూయల్ రోల్ పోషిస్తున్న కరణ్ జొహార్
- ఫిబ్రవరి 23న విడుదల
ఈ మూవీకి చెందిన ట్రైలర్ ను విడుదల చేశారు. న్యూయార్క్ లో జరుగుతున్న ఓ ఈవెంట్ కు వీరంతా వెళతారు. అక్కడ కరణ్ ను కిడ్నాప్ చేస్తారు. దీంతో, కరణ్ 'బాహుబలి' అంటూ గట్టిగా అరుస్తాడు. అప్పుడు రానా వచ్చి కరణ్ ను రక్షిస్తాడు. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. కరణ జొహార్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ చిత్రం... ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.