Jagan: వైఎస్ జగన్ వి అన్నీ తండ్రి పోలికలే: ఉండవల్లి కీలక వ్యాఖ్య
- మాట ఇస్తే నిలబడే వ్యక్తి వైఎస్ఆర్
- జగన్ కూడా అంతే
- పాదయాత్రతో జగన్ కు అనూహ్యంగా పెరిగిన ప్రజా మద్దతు
- మాజీ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్య
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ మాట ఇస్తే, దానిపైనే నిలబడే వ్యక్తని, ఆయన పోలికలే వైఎస్ జగన్ కూ వచ్చాయని కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ ఏదైనా చెబితే చేసి తీరుతారని అన్నారు. వైఎస్ కు ఉన్న ఆ గుణమే, ఆయన్ను ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపిందని తెలిపారు. పాదయాత్ర ప్రారంభించిన తరువాత, జగన్ కు ప్రజా మద్దతు అనూహ్యంగా పెరిగిపోయిందని అభిప్రాయపడ్డ ఆయన, సీఎం పదవిని చేపట్టేందుకు జగన్ కు పూర్తి అర్హతలు ఉన్నాయని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని విభాగాల్లోనూ విఫలమయ్యారని, బీజేపీతో పొత్తు పెట్టుకుని కూడా కీలకమైన ఏ ఒక్క విభజన హామీనీ ఆయన సాధించలేక పోయారని విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ సహా ఎన్నో కీలక హామీలను కేంద్రం నెరవేర్చకపోయినా, చంద్రబాబు కిక్కురుమనడం లేదని నిప్పులు చెరిగారు. తాజాగా విడుదలైన ఓ నివేదికను గుర్తు చేస్తూ, ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను తొలగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆరోపించారు.