growth: సమగ్రాభివృద్ధిలో మన స్థానం పాక్ కంటే కూడా కిందేనా...?

  • సమగ్రతలో 72వ స్థానం
  • అభివృద్ధిలో 66
  • నంబర్ 1గా నిలిచిన నార్వే

ప్రపంచ ఆర్థిక ఫోరం సమగ్రాభివృద్ధి సూచీలో భారత్ స్థానం చాలా దిగువన ఉంది. 74 వర్థమాన దేశాల సూచీలో మన స్థానం 64. పొరుగు దేశాలు, పాకిస్థాన్, చైనాల కంటే కూడా తక్కువే. అభివృద్ధి, ముందుకు సాగడం, సమగ్రత తదితర అంశాల్లో 103 దేశాల పనితీరును అధ్యయనం చేసిన అనంతరం ప్రపంచ ఆర్థిక వేదిక ఓ నివేదిక విడుదల చేసింది.

 ఈ మూడింటిలో సమగ్రత (అంటే అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడం)లో భారత్ 72వ స్థానంలో ఉంది. అభివృద్ధి, ఎదుగుదలలో 66వ స్థానంలో, అంతర్గత ఈక్విటీ జనరేషన్ (అంటే పాత, కొత్త తరాల మధ్య సహజ సంస్కృతి వాతావరణం కలిగి ఉండడం)లో 44వ స్థానంలో ఉన్నాం. సమగ్రాభివృద్ధిలో నార్వే నంబర్ 1 స్థానంలో ఉండగా, చైనా 24, పాకిస్థాన్ 47వ స్థానాల్లో ఉన్నాయి.

More Telugu News