Balakrishna: నా రికార్డును మరెవరూ కొట్టలేకపోయారు!: నందమూరి బాలకృష్ణ

  • దూసుకుపోతున్న 'జై సింహా'
  • 50 కోట్ల క్లబ్ లో చేరినందుకు సెలబ్రేషన్స్
  • తన అన్ని చిత్రాలూ రికార్డులు సృష్టించినవేనన్న బాలయ్య
  • 'సమరసింహారెడ్డి' రికార్డును మరే చిత్రమూ దాటలేదని వెల్లడి
తాను నటించిన 'జైసింహా' దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ రూ. 50 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా సక్సెస్ సెలబ్రేషన్స్‌ ని హైదరాబాద్ లో నిర్వహించగా, హీరో బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. తనకు రికార్డులు ఎన్నడూ ముఖ్యం కాదని, సినీ పరిశ్రమ బాగుండాలన్నదే తన లక్ష్యమని చెప్పిన బాలయ్య, తన ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో గుర్తుండదని అన్నారు.

తన సినిమాలన్నీ రికార్డులు సృష్టించినవేనని, 'సమరసింహారెడ్డి' ఏకంగా 32 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుందని, ఇది ఆలిండియా రికార్డని, ఆ రికార్డు ఇప్పటికీ చెరిగిపోలేదని అన్నారు. ఏ సినిమా ఎంత వసూలు చేసిందన్న లెక్కలు తనకు గుర్తుండవని, తన అభిమానులు ఆ లెక్కలు బాగా చెబుతారని అన్నారు. 'జై సింహా' కలెక్షన్లతో డిస్ట్రిబ్యూటర్లు, పంపిణీదారులు ఆనందంగా ఉన్నారని తెలిపారు.
Balakrishna
Jai Simha
Rs. 50 Cr Club
Samarasimhareddy

More Telugu News