sai dharam tej: హీరో సాయి ధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’ ఫస్ట్ లుక్ విడుదల

  • నుదుటిపై గాయంతో సీరియస్ గా చూస్తున్న సాయిధరమ్ తేజ్ 
  • వచ్చే నెల 9న విడుదల కానున్న ‘ఇంటిలిజెంట్’ 
  • ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన
‘ఇంటిలిజెంట్’ చిత్రం ఫస్ట్ లుక్ ఈరోజు సాయంత్రం విడుదలైంది. ఈ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం తమ సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేసింది. నుదుటిపై గాయంతో ఉన్న సాయిధరమ్ తేజ్ సీరియస్ గా చూస్తూ ఈ ఫస్ట్ లుక్ లో ఉన్నాడు.

కాగా, ‘ఇంటిలిజెంట్’ టైటిల్ కింద ఇంగ్లీషులో ‘INTTELLIGENT’ అని రాసి ఉండటంపై, ఆ పదంలో అక్షర దోషం ఉందని  భావించిన పలువురు నెటిజన్లు, దానిని సరిదిద్దుకోవాలని చిత్రయూనిట్ కి సూచించారు. అయితే, అది అక్షర దోషం కాదని న్యూమరాలజీ కరెక్షన్ నిమిత్తం ఆ పదంలో ఒక ‘T’ని అదనంగా కలపాల్సి వచ్చిందని చిత్రయూనిట్ చెప్పినట్టు సమాచారం. వచ్చే నెల 9వ తేదీన ‘ఇంటిలిజెంట్’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘ఇంటిలిజెంట్’ కోసం సాయిధరమ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More Telugu News