sanjay dut: సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ షూటింగ్ పూర్తి... జూన్‌లో విడుద‌ల‌

  • ఇన్‌స్టాగ్రాంలో వీడియో పోస్ట్ చేసిన చిత్ర యూనిట్‌
  • సంజ‌య్ పాత్ర‌లో ర‌ణ్‌బీర్ క‌పూర్‌
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాజ్ కుమార్ హిరానీ

బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న 'సంజు' చిత్రం షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన వీడియో ద్వారా వెల్ల‌డించింది. చిత్ర యూనిట్ మొత్తం ఒకే రంగు టీ-ష‌ర్టులు ధ‌రించి, 'ద‌త్స్ ద వే' అని అర‌వ‌డం, చివ‌ర‌లో షూటింగ్ పూర్తైంద‌ని ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరానీ ప్ర‌క‌టించ‌డం ఈ వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియోలో న‌టి సోన‌మ్ క‌పూర్‌ని కూడా చూడొచ్చు. సంజ‌య్ ద‌త్ గ‌ర్ల్‌ఫ్రెండ్ అంటూ ప్రచారం జరిగిన టీనా మునిమ్ పాత్రలో ఆమె న‌టించిన‌ట్లు స‌మాచారం. జ‌న‌వ‌రి 2017లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ‌మైంది. సంజ‌య్ ద‌త్ న‌టుడిగా గుర్తింపు తెచ్చుకోవ‌డం, మాదక ద్ర‌వ్యాలకు బానిసవ‌డం, 1993 ముంబై పేలుళ్ల కేసులో ఇరుక్కోవ‌డం వంటి అంశాల‌ను ఈ సినిమాలో చూపించిన‌ట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో సంజ‌య్ తండ్రి సునీల్ ద‌త్ పాత్ర‌లో ప‌రేశ్ రావెల్‌, న‌ర్గీస్ పాత్రలో మ‌నీషా కొయిరాలా, సంజ‌య్ ద‌త్ భార్య మాన్య‌త పాత్ర‌లో దియా మీర్జా న‌టించారు. ఇక మాధురీ దీక్షిత్ పాత్రలో క‌రిష్మా త‌న్నా, ఓ రిపోర్ట‌ర్ పాత్ర‌లో అనుష్క శ‌ర్మ న‌టించిన సంగ‌తి తెలిసిందే. జూన్ 29, 2018న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

More Telugu News