వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వెబ్ సైట్ పై హ్యాకర్ల దాడి... కస్టమర్ల కీలక సమాచారానికి ముప్పు
- క్రెడిట్ కార్డుల సమాచారం చోరీ
- పలు కస్టమర్ల కార్డులపై మోసపూరిత లావాదేవీలు
- ధ్రువీకరించిన వన్ ప్లస్
‘‘మా సిస్టమ్స్ లో ఒకదానిపై దాడి జరిగింది. పేమెంట్ పేజీలో మాలీషియస్ స్క్రిప్ట్ ను ప్రవేశపెట్టి, క్రెడిట్ కార్డుల సమాచారం దొంగిలించారు. కస్టమర్ల బ్రౌజర్ల నుంచే డేటాను పంపించడం జరిగింది. దీన్ని తొలగించాం’’ అని కంపెనీ ఫోరమ్ ప్రకటనను పోస్ట్ చేశారు. వన్ ప్లస్ డాట్ నెట్ పై గతేడాది నవంబర్ మధ్య నుంచి ఈ ఏడాది జనవరి 11 మధ్య లావాదేవీలు నిర్వహించిన వారి క్రెడిట్ కార్డుల నంబర్లు, ఎక్స్ పయిరీ తేదీలు చోరీకి గురై ఉండొచ్చని కంపెనీ సందేహం వ్యక్తం చేసింది.