Kamal Haasan: నా ప్రాణం పోయేలోగా లక్ష్యం సాధిస్తా: కమల్ హాసన్

  • ఫిబ్రవరి 21 నుంచి కమల్ రాజకీయ యాత్ర షురూ
  • దేశం గొప్పతనం చాటేందుకే రాజకీయాల్లోకి వస్తున్నాను
  • దేశభక్తి యువత నాతో కలిసి నడుస్తారని ఆశిస్తున్నాను
 వచ్చేనెల 21 నుండి తన సొంతగడ్డ రామనాధపురం నుండి యాత్రను ప్రారంభించబోతున్నానని ప్రముఖ సినీ నటుడు కమల హాసన్ తెలిపారు. చెన్నైలో తన అభిమాన సంఘాలతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ, భారతదేశం గొప్పతనాన్ని చాటేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని అన్నారు. తన రాజకీయ యాత్రకు తమిళనాడు నుంచి శ్రీకారం చుడుతున్నానని ఆయన తెలిపారు. అంతే కాకుండా ‘నా ప్రాణంపోయేలోగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాననే నమ్మకం ఉంద’ని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రాజకీయ యాత్రలో దేశభక్తిగల యువత తనతో కలిసి నడిచేందుకు ముందుకు వస్తారని ఆయన పిలుపునిచ్చారు. 
Kamal Haasan
political tour
Tamilnadu

More Telugu News