Amrapali: జూనియర్ ఐపీఎస్ తో లవ్ మ్యారేజ్... ఆమ్రపాలి మనసు దోచిన ఎస్పీ వివరాలివి!

  • 2011 బ్యాచ్ ఐపీఎస్ సమీర్ శర్మ
  • ప్రేమ వివాహం చేసుకోనున్న ఆమ్రపాలి
  • ప్రస్తుతం డయ్యూ ఎస్పీగా సమీర్
వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి వివాహం వచ్చే నెల 18వ తేదీన ఢిల్లీలో జరగనుంది. 2011 బ్యాచ్ కి చెందిన సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ఆమె ప్రేమ వివాహం చేసుకోనున్నారు. 2010లోనే ఐఏఎస్ కు ఎంపికైన ఆమ్రపాలి, తన కన్నా ఓ సంవత్సరం జూనియర్ అయిన శర్మకు మనసిచ్చారు. ఉత్తరాదికి చెందిన సమీర్, ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూలో ఎస్పీగా పని చేస్తున్నారు.

ఆయనతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఆమ్రపాలి, విషయం పెద్దలకు చెప్పి, వారిని కూడా పెళ్లికి ఒప్పించారు. కాగా, ఆమ్రపాలి తండ్రి కాట వెంకటరెడ్డి, ఆంధ్రా యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా పనిచేశారు. మద్రాస్ ఐఐటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన ఆమ్రపాలి, 2010లో సివిల్స్ రాసి 39వ ర్యాంకును సాధించి, ఐఏఎస్ గా ఎంపికయ్యారు.
Amrapali
Sameer Sarma
Warangal Urban District
Marriage

More Telugu News