Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రకటన.. ఉత్తమ నటిగా విద్యాబాలన్!

  • ‘తుమ్హారీ సులు’లో నటనకు గాను ఉత్తమ నటిగా ఎంపికైన విద్యాబాలన్
  • రేఖ చేతుల మీదుగా అవార్డు అందుకున్న నటి
  • వ్యాఖ్యాతగా వ్యవహరించిన షారూక్ ఖాన్

63వ జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటిగా ప్రముఖ నటి విద్యాబాలన్ ఎంపికైంది. ముంబైలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులందరూ హాజరయ్యారు. బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

బెస్ట్ లీడింగ్ రోల్ (ఫిమేల్) కేటగిరీలో ‘బద్రీనాథ్ కి దుల్హానియా’లో పాత్రకు గాను అలియాభట్, భూమి పెడ్నేకర్ (శుభ్ మంగళ్ సావ్‌ధాన్), సబా ఖమర్ (హిందీ మీడియం), శ్రీదేవి (మామ్), విద్యాబాలన్ (తుమ్హారీ సులు), జైరా వాసిమ్ (సీక్రెట్ సూపర్ స్టార్)లు నామినేట్ అయ్యారు. ‘తుమ్హారీ సులు’లో నటనకు గాను విద్యాబాలన్‌కు ఈ అవార్డు దక్కింది. రేఖ అవార్డును బహూకరించారు.

More Telugu News