Warangal Urban District: కలెక్టర్ ఆమ్రపాలిపై జిల్లా కోర్టు ఆగ్రహం!

  • ఐసీడీఎస్ కార్యాలయం కోసం భవనాన్ని అద్దెకు తీసుకున్న అధికార యంత్రాంగం
  • కొంత కాలంగా అద్దె చెల్లింపులో జాప్యం
  • అద్దె కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించిన భవన యజమాని
వరంగల్ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలిపై జిల్లా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐసీడీఎస్‌ కార్యాలయం కోసం తన భవనాన్ని అద్దెకు తీసుకుని.. బకాయిలు 3 లక్షల రూపాయలకు చేరినా చెల్లించడం లేదని, ఐసీడీఎస్ భవన యజమాని కృష్ణారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కలెక్టర్‌ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తక్షణం కిరాయి బకాయిలు చెల్లించాలని ఆదేశించింది. అంతవరకు జిల్లా కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరింత సమగ్ర సమాచారం తెలియాల్సి ఉంది. 
Warangal Urban District
District Collector
amrapali
court

More Telugu News