శ్రీదేవీ కూతురు జాహ్నవి తొలి సినిమా విడుదల డేట్ ఖరారు!
- జులై 20న విడుదలకానున్న ధడక్
- ట్వీట్‌లో వెల్లడించిన నిర్మాత కరణ్ జొహార్
- దర్శకత్వం వహించిన శశాంక్ ఖైతాన్
అగ్రకులానికి చెందిన అమ్మాయి, నిమ్న కులానికి చెందిన అబ్బాయిల మధ్య కలిగిన ప్రేమ, దాని పరిణామాలు కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నాడు. దీని మరాఠీ మాతృక 'సైరత్' ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.