krishnam raju: ప్రభాస్ ఇప్పుడు కొంచెం మెత్తబడ్డాడు: కృష్ణంరాజు

  • పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు
  • నేను సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయింది
  • అభిమానులను సన్మానిస్తా
ప్రభాస్ పెళ్లి గురించి కృష్ణంరాజు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మొన్నటి వరకు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే 'బాహుబలి' పూర్యయ్యాక అనేవాడని... ఇప్పుడేమో 'సాహో' పూర్తి కావాలని అంటున్నాడని చెప్పారు. అయితే ఆయన తీరులో మార్పు వచ్చిందని... పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు.

ఇకపై తాను సినిమాలకు 25 శాతం, రాజకీయాలకు 75 శాతం సమయాన్ని కేటాయిస్తానని కృష్ణంరాజు చెప్పారు. ఈ ఏడాదితో తాను సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిందని తెలిపారు. సహజత్వానికి దగ్గరగా నటించాలనే తపన, అభిమానుల ప్రేమ వల్లే ఇన్నేళ్లపాటు సినీరంగంలో కొనసాగగలిగానని చెప్పారు. రెండు, మూడు నెలల్లో ఓ వేడుకను నిర్వహించి, అభిమానులను సన్మానిస్తానని తెలిపారు. తమ సొంత నిర్మాణ సంస్థలో ప్రభాస్ హీరోగా నటించనున్న సినిమాకు కథా చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
krishnam raju
tollywood
Prabhas

More Telugu News